దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని | DeeviMchu Maa TaMDri Maa Bhaarata DaeSaanni| Song Lyrics In Telugu
రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని
నలిగిపోతున్న నా ప్రజను నశియించుచున్న ఆత్మలను
1
మద్యపానమే మనిషి ప్రాణమును బలిచేయుచున్నది
ఆలుబిడ్డల ఆర్త్హనాదము ఆకాశమంటుచున్నది
మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది
అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది
అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి
"దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని"
2
అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి
మనుషులలో దుష్కామవాంఛను రగిలించుచున్నవి
హేయమైన బహుఘోర పాపముకు తెరతీయుచున్నది
అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది
అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి
"దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని"
3
మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది
సమతా మమతలమాటె మనిషిలో మరుగవుచున్నది
రాక్షసత్వమే మనిషితత్వమై అలరారుచున్నది
ప్రేమతత్వమే పనికిరానిదని తలపోయుచున్నది
రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి
"దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని"
DeeviMchu Maa TaMDri Maa Bhaarata DaeSaanni | Song Lyrics In English
Rakshinchu Maa Tandri Maa Prema Samaajaanni
Naligipotunna Naa Prajanu Nasiyinchuchunna Aatmalanu
1
Madyapaaname Manishi Praanamunu Balicheyuchunnadi
Aalubiddala Aarthanaadamu Aakaasamantuchunnadi
Maadaka Dravyam Yavana Bratukulanu Saasinchuchunnadi
Andhakaarame Andaripaina Raajyamu Cheyuchunnadi
Andhakaaramunu Tolaginchi Aatmajyotulanu Veliginchi
"Deevinchu Maa Tandri Maa Bhaarata Desaanni"
2
Asleela Chitrapu Aagadaalu Mitimeeruchunnavi
Manushulalo Dushkaamavaanchanu Ragilinchuchunnavi
Heyamaina Bahughora Paapamuku Terateeyuchunnadi
Andhakaarame Andaripaina Raajyamu Cheyuchunnadi
Andhakaaramunu Tolaginchi Aatmajyotulanu Veliginchi
"Deevinchu Maa Tandri Maa Bhaarata Desaanni"
3
Mataala Perita Maarana Homam Konasaaguchunnadi
Samataa Mamatalamaate Manishilo Marugavuchunnadi
Raakshasatvame Manishitatvamai Alaraaruchunnadi
Prematatvame Panikiraanidani Talapoyuchunnadi
Raakshasatvamunu Tolaginchi Prematatvamunu Prabalinchi
"Deevinchu Maa Tandri Maa Bhaarata Desaanni"