గోరంతలు GORANTHALU Song Lyrics In Telugu
పరులార్జన నీ సొంతముగా చూపి
గప్పాలు కొట్టే పెద్దయ్యో
గొప్పలు చెప్పవద్దయ్యో
అన్నీ ఉన్న విస్తరి ఎపుడూ అణిగిమణిగి ఉంటుంది
ఖాళీగున్న పాత్రయే చాలా చప్పుడు చేస్తుంటుంది
మాటలింక తగ్గించాలి చేతలలో చూపించాలి
నీ ఘనతను నువ్వుగాక నీ పనులే చాటించాలి
నిన్నుగూర్చి ఇతరులు చెపితే తెలుస్తుంది నీ మంచితనం
నీ మంచిని పరులు పొగిడితే పెరుగుతుంది నీదు గౌరవం
మృదుభాషణే అలంకారం నోరు కాచుకుంటే శ్రేష్టం
చేతనైన మంచిపని చేస్తేనే ఆశీర్వాదం
చెప్పిందే చెయ్యాలంటూ యేసుక్రీస్తు బోధించాడు
చేసిందే చెప్పాలంటూ ఆచరించి చూపించాడు
గురునిబోధ పాటించాలి అడుగులలో పయనించాలి
హెచ్చింపబడాలంటే తగ్గింపుతో జీవించాలి
GORANTHALU Song Lyrics In English
Parulaarjana Nee Sontamugaa Choopi
Gappaalu Kotte Peddayyo
Goppalu Cheppavaddayyo
Annee Unna Vistari Epudoo Anigimanigi Untundi
Khaaleegunna Paatraye Chaalaa Chappudu Chestuntundi
Maatalinka Tagginchaali Chetalalo Choopinchaali
Nee Ghanatanu Nuvvugaaka Nee Panule Chaatinchaali
Ninnugoorchi Itarulu Chepite Telustundi Nee Manchitanam
Nee Manchini Parulu Pogidite Perugutundi Needu Gauravam
Mrudubhaashane Alankaaram Noru Kaachukunte Sreshtam
Chetanaina Manchipani Chestene Aaseervaadam
Cheppinde Cheyyaalantoo Yesukreestu Bodhinchaadu
Chesinde Cheppaalantoo Aacharinchi Choopinchaadu
Gurunibodha Paatinchaali Adugulalo Payaninchaali
Hechchinpabadaalante Tagginputo Jeevinchaali
Tags:
Telugu Christian Lyrics