వినరే యో నరులారా |Vinareyo Narulara | Song Lyrics In Telugu
మనల రక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే
అనుదినమును దే వుని తనయుని
పద వనజంబులు మన మున నిడికొనుచును
నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని
దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు
కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి
రయంబున ప్రభు కరుణను గనరే "వినరే"
ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష
బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను
దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ
యాగము సలిపిన తెరంగిది "వినరే"
పొందుఁగోరిన వారి విందా పరమోపకారి
యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను
అందమునన్ దన బొంది సురక్తము
జిందెను భక్తుల డెందము గుందఁగ "వినరే"
ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని
సుఖ ములు మరి యొసఁగును "వినరే"
దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగఁ జనె
బిరబిర మన మం దర మా కరుణా శరనిధి
చరణ మె శరణని పోదము "వినరే"
Vinareyo Narulara | Song Lyrics In English
Manala Rakshinpa Kreestu Manujaavataaru@M Dayyo Vinare
Anudinamunu De Vuni Tanayuni
Pada Vanajanbulu Mana Muna Nidikonuchunu
Nararoopu@M Booni Ghora Narakula Raarammani
Duritamu@M Baapu Dodda Dorayo Mariyaa Varaputru@Ndu
Kara Maru Dagu Ka Lvari Giri Dari Kari Gi
Rayanbuna Prabhu Karunanu Ganare "Vinare"
Aanandamaina Moksha Mandari Kiyya Deeksha
Booni Tanameni Siluva Mraanu Nana@Nchi Mruti@M Bondenu
Deena Dayaa Paru@M Daina Mahaatmu@Ndu Jaanuga
Yaagamu Salipina Terangidi "Vinare"
Pondu@Ngorina Vaari Vindaa Paramopakaari
Yenda Rendari@M Baramaa Nandapada Monda@Nga@M Jesenu
Andamunan Dana Bondi Suraktamu
Jindenu Bhaktula Dendamu Gunda@Nga "Vinare"
Ila Maayaavaadula Maani Yita@Nde Sadguru Dani
Talaposi Choochi Mati Ni Schala Bhaktini Golichina Vaariki
Nila Janulaku Galu Mulanalaredu Dhani Kula Kandani
Sukha Mulu Mari Yosa@Ngunu "Vinare"
Duritamu Lana@Npa Vachchi Maranamai Tirigi Lechi
Nirata Mokshaananda Sum Dara Mandiramuna Karuduga@M Jane
Birabira Mana Mam Dara Maa Karunaa Saranidhi
Charana Me Saranani Podamu "Vinare"