మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో |MATTILONA MUTHYAM| Song Lyrics In Telugu
సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురో
నింగినేలంతా ఆడి పాడంగా
సంబరాలతో సందడాయెగా
బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో
దీనుడై పుట్టినాడురా సుఖమే కోరలేదురా
ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో
దీపమై వచ్చినాడురా భేదమే చూపలేదురా
ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార
పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా
అంబరాన్నంటే సంబరాలతో సందడే ఇల
వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో
స్నేహమై చేరినాడురా ప్రేమనే పంచినాడురా
అంధకార లోయలో అంతు లేని బాటలో
మనకై వెదకినాడురా రక్షణే తెచ్చినాడురా
ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా
రావా యేసు చెంత మనసారా వేడుకోగా
అంబరాన్నంటే సంబరాలతో సందడాయెగా
MATTILONA MUTHYAM | Song Lyrics In English
Sandepoddu Sooreedalle Vachchaaduro
Ninginelantaa Aadi Paadangaa
Sanbaraalato Sandadaayegaa
Betlehemu Oorilo Pasuvula Paakalo
Deenudai Puttinaaduraa Sukhame Koraleduraa
Aa Chaliraatrilo Cheekatanti Bratukulo
Deepamai Vachchinaaduraa Bhedame Choopaleduraa
Ento Vinta Kaadaa Daari Choope Divya Taara
Paade Dootalantaa Kadilochche Gollalantaa
Anbaraannante Sanbaraalato Sandade Ila
Vennelanti Veedhilo Challanaina Chooputo
Snehamai Cherinaaduraa Premane Panchinaaduraa
Andhakaara Loyalo Antu Leni Baatalo
Manakai Vedakinaaduraa Rakshane Techchinaaduraa
Ento Vinta Kaadaa Mari Ninne Koraledaa
Raavaa Yesu Chenta Manasaaraa Vedukogaa
Anbaraannante Sanbaraalato Sandadaayegaa