ఏమున్నది నాలో EMUNNADI NALOO Song Lyrics In Telugu
మచ్చుకైన మంచి కానరాదయ్యా
ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా
ఎందుకయ్య నాపై నీకింత ప్రేమయ్యా
యేసయ్యా నా దైవమా
యేసయ్యా నిత్యజీవ మార్గమా
యేసయ్యా నా దైవమా
యేసయ్యా పరలోక ద్వారమా
నినుచూడ సాధ్యమేనా తేజోమయ
కరుణించి ననుచేరే నీదయ
వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం
తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం
క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము
నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును "యేసయ్యా"
నీపైనే తిరుగుబాటు చేసానయ్యా
తాలిమితో మన్నించే నీ దయ
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం
కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం
నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము
సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును "యేసయ్యా"
నిను వీడి పారిపోతి ప్రేమామయ
విడువకయే నను వెదకే నీ దయ
వినబడగా నీ స్వరం పులకించెను దేహం
తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం
క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము
వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును "యేసయ్యా"
EMUNNADI NALOO Song Lyrics In English
Machchukaina Manchi Kaanaraadayyaa
Entavedaki Choochinaa Paapame Gadayyaa
Endukayya Naapai Neekinta Premayyaa
Yesayyaa Naa Daivamaa
Yesayyaa Nityajeeva Maargamaa
Yesayyaa Naa Daivamaa
Yesayyaa Paraloka Dvaaramaa
Ninuchooda Saadhyamenaa Tejomaya
Karuninchi Nanuchere Needaya
Veluvadagaa Neevaakyam Kanabade Naapaapam
Tadabadina Naa Paadam Sthirapade Neekosam
Kshamiyinchi Ichchaavayyaa Neekrupaakshemamu
Nannaavarinchenayyaa Needuvaatsalyamu
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu "Yesayyaa"
Neepaine Tirugubaatu Chesaanayyaa
Taalimito Manninche Nee Daya
Sramapadagaa Needeham Sariyaayenu Sarvam
Kaarchitivi Neerudhiram Dorikenu Parihaaram
Ne Teerchajaalanayyaa Nee Runame Maatramu
Saakshigaa Nilutunayyaa Naa Jeevitaantamu
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu "Yesayyaa"
Ninu Veedi Paaripoti Premaamaya
Viduvakaye Nanu Vedake Nee Daya
Vinabadagaa Nee Svaram Pulakinchenu Deham
Tenchitivi Bandhakam Kaligenu Svaatantryam
Kshanamaina Viduvanayyaa Nee Sannidhaanamu
Vivarinpa Jaalanayyaa Ee Goppa Bhaagyamu
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu "Yesayyaa"