All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Deenuda Ajeyuda Song Lyrics | దీనుడా అజేయుడా | Telugu Christian Lyrics

Deenuda Ajeyuda Telugu Lyrics


దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని - శృతిమించి పాడనా
జీవధారవు నీవని - కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చనచేసేదా నీకే - నా స్తుతులర్పించెద నీకే "దీనుడా"

సమ్మతి లేని సుడిగుండాలే - ఆవవరించగా
గమనము లేని పోరాటలే - తరుముచుండగా
నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా
హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువ చాటునే దాచావు
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతి మాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా"

సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనసుతో - హృదయర్చనే చేసేద
కరుణ నీడలో - కృపవాడలో - నీతో ఉంటే చాలుయ్యా
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా "దీనుడా"

ఊహకందని ఉన్నతమైనది - దివ్య నగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే
ఆ నగరమే లక్ష్యమే - మహిమత్మాతో నింపినావు
అమరలోకాన - నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను
ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా "దీనుడా"


Deenuda Ajeyuda English Lyrics


Deenudaa Ajeyudaa - Aadarana Kiranamaa
Poojyudaa Paripoornudaa - Aananda Nilayamaa
Jeevadaatavu Neevani - Srutiminchi Paadanaa
Jeevadhaaravu Neevani - Kaanukanai Poojinchanaa
Akshaya Deepamu Neeve - Naa Rakshana Srungamu Neeve
Svaraarchanachesedaa Neeke - Naa Stutularpincheda Neeke "Deenudaa"

Sammati Leni Sudigundaale - Aavavarinchagaa
Gamanamu Leni Poraatale - Tarumuchundagaa
Nirupedanainaa Naa Yedala - Sandehamemee Lekundaa
Hetuveleni - Prema Choopinchi - Siluva Chaatune Daachaavu
Santoshamu Neeve - Amruta Sangeetamu Neeve
Stuti Maalika Neeke - Vajrasankalpamu Neeve "Deenudaa"

Satya Pramaanamu Neraverchutake - Maargadarsivai
Nitya Nibandhana Naato Chesina - Satyavantudaa
Virigi Naligina Manasuto - Hrudayarchane Cheseda
Karuna Needalo - Krupavaadalo - Neeto Unte Chaaluyyaa
Kartavyamu Neeve - Kanula Panduga Neevegaa
Visvaasamu Neeve - Vijaya Sikharamu Neevegaa "Deenudaa"

Oohakandani Unnatamainadi - Divya Nagarame
Spatikamu Polina Sundaramainadi - Nee Raajyame
Aa Nagarame Lakshyame - Mahimatmaato Ninpinaavu
Amaralokaana - Nee Sannidhilo Krotta Keertane Paadedanu
Utsaahamu Neeve - Nayanotsavan Neevegaa
Ullaasamu Neelo - Oohala Pallaki Neevegaa "Deenudaa"



Post a Comment

Previous Post Next Post