ఘనమైనవి నీ కార్యములు |Ganamainavi Nee karyamulu | Song Lyrics In Telugu
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
యే తెగులు సమీపించనీయక
యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు
ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి
బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము "ఘనమైనవి"
నాకు ఎత్తైన కోటవు నీవే
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే
శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు
దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము "ఘనమైనవి"
నీ కృప తప్ప వేరొకటి లేదయా
నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో
నీ కృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను
చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము "ఘనమైనవి"
Ganamainavi Nee karyamulu | Song Lyrics In English
Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa
Krupalanu Ponduchu KrutajNata Kaligi
Stutularpinchedanu Annivelalaa
Anudinamu Nee Anugrahame
Aayushkaalamu Nee Varame
Ye Tegulu Sameepinchaneeyaka
Ye Keedaina Daricheraneeyaka
Aapadalanni Tolage Varaku
Aatmalo Nemmadi Kalige Varaku
Naa Bhaaramu Mosi
Baasatagaa Nilichi Aadarinchitivi
Ee Stuti Mahimalu Neeke
Chellinchedanu Jeevitaantamu "Ghanamainavi"
Naaku Ettaina Kotavu Neeve
Nannu Kaapaadu Kedemu Neeve
Aasrayamaina Bandavu Neeve
Saasvata Krupakaadhaaramu Neeve
Naa Pratikshanamunu Neevu
Deevenagaa Maarchi Nadipinchuchunnaavu
Ee Stuti Mahimalu Neeke
Chellinchedanu Jeevitaantamu "Ghanamainavi"
Nee Krupa Tappa Verokati Ledayaa
Nee Manasulo Nenunte Chaalayaa
Bahu Kaalamugaa Nenunna Sthitilo
Nee Krupa Naa Yeda Chaalunantive
Nee Arachetilo Nanu
Chekkukuntivi Naakemi Koduva
Ee Stuti Mahimalu Neeke
Chellinchedanu Jeevitaantamu "Ghanamainavi"