Parishudhudavai Mahima Prabhavamulaku Song Lyrics In Telugu
పరిశుద్ధుడవై మహిమప్రభావములకు
నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృప చూపువాడవు
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి
నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును
కిరీటముగా
ధరింపజేసితివి
శాశ్వత కాలము వరకు
నీ సంగతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివి "ఆరాధన నీకే"
నీనిత్యమైన ఆదరణ చూపి
నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును
నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు
నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి "ఆరాధన నీకే"
ఆనందకరమైన దేశములో నేను
నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి
సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు
నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదను. "ఆరాధన నీకే"
Parishudhudavai Mahima Prabhavamulaku Song Lyrics in English
pariSuddhuDavai mahimaprabhaavamulaku
neevae paatruDavu
balavaMtuDavai
deenula pakshamai kRpa choopuvaaDavu
dayaaluDavai dhaaraalamugaa nanu deeviMchina SreemaMtuDaa
aaraadhana neekae naa yaesayyaa
nee svaasthyamaina neevaaritO kalisi
ninu saeviMchuTaku
nee mahima prabhaavamunu
kireeTamugaa
dhariMpajaesitivi
SaaSvata kaalamu varaku
nee saMgatipai dRshTi nilipi
nee daasula praardhanalu saphalaparachitivi "aaraadhana neekae"
neenityamaina aadaraNa choopi
nanu sthiraparachuTaku
nee karuNakaTaakshamunu
naapai kuripiMchi nanu praemiMchitivi
naaku prayOjanamu kalugajaeyuTaku
nee upadaeSamunu bOdhiMchi
nee daasuni praaNamunu saMtOshaparachitivi "aaraadhana neekae"
aanaMdakaramaina daeSamulO naenu
ninu ghanaparachuTaku
nee mahimaatmatO niMpi
surakshitamugaa nannu nivasiMpajaesitivi
maeghavaahanuDavai vachchuvaraku
nae kanipeTTuchuMdunu nee kOsamu
nee daasula kaaMkshanu saMpoorNaparachedanu. "aaraadhana neekae"