nadipinchu na nava song lyrics in Telugu
పల్లవి : నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నాజన్మ తరింప
1. నా జీవిత తీరమున - నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము || నడిపి ||
2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభు జయము
రహదారులు వెదికినను - రాదాయెను ప్రతి ఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ || నడిపి ||
3. ఆత్మార్పణ జేయకయే- ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని -అల్లాడె నా వలలు || నడిపి ||
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణయము బొంది
ఫలహీనడనై యిపుడు - పాటింతు నీ మాట || నడిపి ||
5. లెఒతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న యీవులలో - లోటైన నా బ్రతుకు
లోపించని యర్పణగా - లోకేశ జేయుమయా || నడిపి ||
6. ప్రభుయేసుని శిషుడవై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకిటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకధ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - ప్రాణార్పణము జేతు || నడిపి ||
nadipinchu na nava song lyrics in English
Pallavi : Nadipimchu Naa Naava - Nadi Samdramuna Devaa
Nava Jeevana Maargamuna - Naajanma Tarimpa
1. Naa Jeevita Teeramuna - Naa Yapajaya Bhaaramuna
Naligina Naa Hrdayamunu - Nadipimchumu Loetunaku
Naa Yaatma Virabuuya - Naa Deeksha Phaliyimpa
Naa Naavaloe Kaalidumu - Naa Seva Jekonumu || Nadipi ||
2. Raatramtayu Sramapadinaa - Raaledu Prabhu Jayamu
Rahadaarulu Vedikinanu - Raadaayenu Prati Phalamu
Rakshimchu Nee Siluva - Ramaneeya Loetulaloe
Ratanaalanu Vedakutaloe - Raajillu Naa Padava || Nadipi ||
3. Aatmaarpana Jeyakaye- Aasimchiti Nee Chelimi
Ahamunu Premimchuchune - Arasiti Prabhu Nee Kalimi
Aasaa Niraasaaaye - Aaveda Neduraaye
Aadhyaatmika Lemigani -Allaade Naa Valalu || Nadipi ||
4. Prabhu Maargamu Vidachitini - Praardhinchuta Maanitini
Prabhu Vaakyamu Vadalitini - Paramaardhamu Marachitini
Prapamcha Natanalaloe - Praaveenayamu Bomdi
Phalaheenadanai Yipudu - Paatimtu Nee Maata || Nadipi ||
5. Leotaina Jalamulaloe - Loetuna Vinabadu Svaramaa
Loebadutanu Nerpimchi - Loepambulu Savarimchi
Loenunna Yeevulaloe - Loetaina Naa Bratuku
Loepimchani Yarpanagaa - Loekesa Jeyumayaa || Nadipi ||
6. Prabhuyesuni Sishudavai - Prabhu Premaloe Paadukoni
Prakitimtunu Loekamuloe - Parisuddhuni Premakadha
Paramaatma Proekshanatoe - Paripuurna Samarpanatoe
Praanambunu Prabhukoraku - Praanaarpanamu Jetu || Nadipi ||